GROUP 2 MINI GRAND TEST - 01

గమనిక

1. ఈ Test లో ఉన్నటువంటి ప్రశ్నలు మొత్తం గత APPSC మరియు TSPSC పరీక్షలకు చెందినవి (Previous Questions).

2. ఈ Test లో Negative Marks కూడా ఉన్నాయి.

3. ప్రతీ తప్పు సమాధానమునకు 0.25 మార్కు తొలగించబడుతుంది. (1/4 Negative Marking).

4. ఇందులో ఇవ్వబడిన Previous Questions అన్నింటికీ, వాటి యొక్క “Key” ఆధారంగా సమాధానాలు ఇవ్వబడ్డాయి.

5. ఒకవేళ మీ దృష్టికి ఏదైనా సమాధానం తప్పుగా అనిపిస్తే, క్రింద ఉన్నటువంటి “CONTACT US" ద్వారా మాకు తెలియజేయగలరు.


1. ఏ కాలువ ఇండియా, యూరప్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది?
A. సూయజ్ కాలువ
B. ఆల్బర్ట్ కెనాల్
C. మిడి కాలువ
D. బ్రగ్ - జీబూగ్జ్ కాలువ

2. హోమోస్పియర్ ను ఎన్ని పొరలుగా విభజించవచ్చు?
A. 2
B. 3
C. 4
D. 5

3. సిస్మలాజీ అనగానేమి?
A. మాగ్మా లేదా రాళ్ళు ద్రవంగా మారి భూ ఉపరితలంపై ప్రవహించడం
B. భూ ఉపరితలం యొక్క అధ్యయనం
C. భూకంపాల గురించి అధ్యయనం చేస్తుంది
D. భూ ఉపరితలం నుండి సిస్మిక్ తరంగాల పుట్టుక ప్రాంతం

4. ఏ గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు పరిమాణం భూమి మాదిరిగా ఉంటుంది?
A. అంగారకుడు
B. బుధుడు
C. గురుడు
D. శుక్రుడు

5. భూమి యొక్క దాదాపు వయస్సు
A. 4.78 బిలియన్ సంవత్సరాలు
B. 4.40 బిలియన్ సంవత్సరాలు
C. 4.02 బిలియన్ సంవత్సరాలు
D. 4.54 మిలియన్ సంవత్సరాలు

6. టోర్నడోలని (సుడిగాలులు) అంచనా వేయడానికి అనుసరించే ప్రామాణిక పద్దతి?
A. ఇ.ఎఫ్.స్కేల్
B. పుజిటా స్కేల్
C. బ్యూఫోర్ట్ స్కేల్
D. సాఫిర్ - సింప్సన్ వైండ్ స్కేల్

7. విరూపకార శిలల సిద్ధాంతం ప్రకారం భూమి ఎన్ని శిలలను కలిగి ఉంది?
A. 5
B. 7
C. 9
D. 10

8. ప్రపంచంలో అత్యంత పొడవైన అగ్నిపర్వత గొలుసు ఏ ఖండంలో ఉంది?
A. ఆస్ట్రేలియా
B. ఐరోపా
C. అమెరికా
D. ఆసియా

9. నల్ల సముద్రానికి, కాస్పియన్ సముద్రానికి మధ్యనున్న పర్వతం ఏది?
A. ఊరల్
B. ఆల్న్స్
C. బాల్కాన్
D. కాకసస్

10. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత?
A. 4170 కెల్విన్
B. 4778 కెల్విన్
C. 5778 కెల్విన్
D. 5175 కెల్విన్

11. భూగోళశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు?
A. హోల్మ్స్
B. ఎరటోస్తనీస్
C. అరిస్టాటిల్
D. హిప్పార్కస్

12. విశ్వం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు?
A. కాస్మాలజీ
B. సైన్స్
C. గెలాక్సీ
D. క్లైమటోలజీ

13. క్రిందివాటిలో ఏ గ్రహం అంతరగ్రహం కాదు?
A. గురుడు
B. అంగారకుడు
C. భూమి
D. శుక్రుడు

14. అంతర్జాతీయ EARTH DAY ఎప్పుడు జరుపుకుంటారు?
A. ఏప్రిల్ 20
B. ఏప్రిల్ 22
C. మార్చి 20
D. మార్చి 22

15. హిందూ మహాసముద్రంలో ఉన్న ......... మరియు ........... ద్వీపాలు సమీప పొరుగు దేశాలు?
A. మారిషస్ మరియు సీషెల్స్
B. ఇండోనేషియా మరియు మలేషియా
C. శ్రీలంక మరియు మాల్దీవులు
D. కంబోడియా మరియు థాయిలాండ్

16. శిలాజ బూడిదలో పొందుపరచబడిన మానవపొద ముద్రణం యొక్క గుర్తులు ఇక్కడ ఆవిష్కరించబడింది?
A. లా చాపెల్లె - ఆక్స్ - సెయింట్స్, ఫ్రాన్స్
B. మకపన్సంగట్, దక్షిణాఫ్రికా
C. ఫయూమ్ డిపాజిట్లు, ఈజిప్టు
D. లైలోటి, టాంజానియా

17. ఈ క్రిందివాటిలో ఏ సముద్రం, ప్రపంచంలో అత్యంత ఉప్పునీరు కలిగి ఉంది?
A. మృత సముద్రం
B. సుపీరియర్ సరస్సు
C. హిందూ మహాసముద్రం
D. పెర్షియన్ గల్ఫ్

18. సీరానెవాద అనే పేరు?
A. అమెరికాలోని ఒక పండు
B. అమెరికాలోని ఒక పర్వతం
C. అమెరికాలో కనుగొనబడ్డ ఒక వ్యాధి
D. అమెరికాలోని ఒక జంతువు

19. క్రింది వాటిలో ఏది నేలబొగ్గు కాదు?
A. రాణిగంజ్
B. ఉమెరియా
C. మొసబాని
D. కోబ్రా

20. భూపటలానికి, భూ ప్రావారానికి మధ్య ఆగిపోయిన ఎల్ల?
A. కాన్రాడ్
B. స్యూస్
C. గుటన్ బర్గ్
D. మోహు

21. సముద్రపు లోతైన స్థలాకృతిని ఇలా .......... చూపిస్తారు?
A. హోలోమెట్రిక్ కర్వ్
B. హైడ్రోస్టాటిక్ కర్వ్
C. అల్టిమెట్రిక్ కర్వ్
D. హైప్సోమెట్రిక్ కర్వ్

22. గైసర్స్/వేడినీటి బుగ్గలకు ప్రసిద్ధి పొందిన పసుపురాతి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
A. కెనడా
B. న్యూజిలాండ్
C. USA
D. ఆస్ట్రేలియా

23. క్రింది వాటిలో అగ్నిపర్వతం ఏది?
A. బ్లాంక్ పర్వతం
B. ఎట్నా పర్వతం
C. ఎవరెస్ట్ పర్వతం
D. లూయిస్ పర్వతం

24. ఉత్తర అమెరికాకు చెందిన గొప్ప చెరువుల్లో ఒకటి కానిదేది?
A. విక్టోరియా
B. ఎయిరీ
C. హ్యూరాన్
D. ఒంటారియో

25. సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది?
A. బాల్టిక్ సముద్రం, మెడిటరేనియన్ సముద్రం
B. మెడిటరేనియన్ సముద్రం, ఎర్రసముద్రం
C. మెడిటరేనియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం
D. బాల్టిక్ సముద్రం, ఫసిఫిక్ మహాసముద్రం

26. క్రిందివాటిలో వెచ్చని మహాసముద్ర ప్రవాహాలు కానిదేది?
A. అగుల్షస్ ప్రవాహం
B. బ్రెజిల్ ప్రవాహం 
C. హంబోల్డ్ ప్రవాహం
D. ఖురోషియో ప్రవాహం

27. క్రింది వాటిలో ఎత్తైన ఆల్బెడో ఏది?
A. గడ్డి
B. ఇసుక
C. నీరు
D. మంచు

28. విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండం?
A. ఆఫ్రికా
B. ఆసియా
C. ఆస్ట్రేలియా
D. అమెరికా

29. ఏ దేశంలో కిలిమంజారో పర్వతం ఉంది?
A. కెన్యా
B. రష్యా
C. టాంజానియా
D. మయన్మార్

30. కరగండ బేసిన్ దేనికి ప్రసిద్ధి?
A. మాంగనీస్
B. బొగ్గు
C. ఇనుము
D. పెట్రోలియం

31. ఆంధ్రా దేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన. ప్రస్తావన ఎవరి రచనలో ఉంది?
A. మెగస్తనీస్
B. ఫాహియాన్
C. నికోలా డీ కొంటీ
D. మార్కోపోలో

32. టక్కావి అనే పదం దేనికి సంబంధించినది?
A. ఒకరకమైన నాణెం
B. వ్యవసాయ ఋణాలు
C. వస్తువుల అమ్మకాలపైన విధించే పన్ను
D. పంటలలో ఒక రకం

33. గౌతమ బుద్ధునికి సమకాలికుడు ఎవరు?
A. ఉదయన్
B. బింబిసారుడు
C. మహాపద్మ
D. అజాతశత్రు

34. ఏ కాలంలో ధోలవీర ప్రాంతం ప్రజలచే విరసిల్లింది?
A. 3000 - 1700 BCE
B. 3000 - 1800 BCE
C. 3100 - 1900 BCE
D. 3150 - 1700 BCE

35. హర్షవర్ధనుడి కాలంలో (606 - 647) తన ఆస్థాన కవి ఎవరు?
A. వాక్పటి రాజా
B. పద్మగుప్త పెరిమాల్
C. వల్ల
D. బాణభట్టు

36. ఈ క్రింద పేర్కొనబడిన చైనా యాత్రికుడి నుంచి మొదటి గుప్తుల పరిపాలకుని గురించి కొంత సమాచారం తెలుసుకోవచ్చు?
A. వాంగ్ హుయాన్ సే
B. హుయాన్ త్సాంగ్
C. ఫాహియాన్
D. ఇత్సింగ్

37. హర్షుడి తదనంతర కాలంలో తరచు ప్రస్తావనకు వచ్చే “హుండీ” అనే పదం ఈ కింది పద సముదాయంలో ఏ పద సముదాయాన్ని సూచిస్తుంది?
A. భూస్వామి తన కింది ఉద్యోగులకు జారీ చేసే పత్రం
B. దినసరి ఖాతాలకు నిర్వహించే డైరీ
C. రాజు తన కింది ఉద్యోగులకు జారీ చేసే సలహా పత్రం
D. బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్

38. భారత చరిత్రకు సంబంధించి, కుల్యవాపా, ద్రోణవాసా అంటే ఏమిటి?
A. వివిధ ద్రవ్యమానం తెలిపే నాణేలు
B. నగర భూముల వర్గీకరణ
C. భూమి కొలమానం
D. మతపరమైన పర్వదినాలు

39. ప్రాచీన కాలంలో గుప్తుల యుగంలో ఘంటసాల, కదురా, చాల్ పట్టణాలు దేనికి ప్రసిద్ధి?
A. విదేశీ వాణిజ్యం నిర్వహించే రేవులు
B. బలమైన రాజ్యాల ముఖ్య పట్టణాలు
C. సౌందర్య వంతమైన శిలావస్తువులు, వాస్తుకళ
D. ప్రముఖ బౌద్ధ తీర్థ యాత్రా స్థలాలకు

40. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు అత్యంత శక్తివంతమైన మహాజనపదం ఏది?
A. కాశి
B. మగధ
C. కురు
D. మత్స్య

41. ప్రజలకు తమ ఆదేశాలను తెలియజేయడం కోసం శాసనాలు వేయించిన మొదటి రాజు ఎవరు?
A. అశోకుడు
B. చంద్రగుప్త మౌర్యుడు
C. సముద్రగుప్తుడు
D. చంద్రగుప్త 2

42. చిదంబరం, తంజావూరు మరియు గంగైకొండ చోళపురం లను ఏ రాజులు నిర్మించారు?
A. మౌర్య రాజులు
B. చోళ రాజులు
C. శక రాజులు
D. కుషాణ రాజులు

43. సామవేదం ఏ అంశానికి ముఖ్య ఆధారం?
A. చిత్ర లేఖనం
B. ఔషధాలు
C. సంగీతం
D. యుద్ధ కళలు

44. సింధూ లోయ నాగరికత లక్షణాలలో ఈ క్రింది ఏ అంశాలలో ఖచ్చితమైన ఏకరూపకత కనిపిస్తుంది?
A. వ్యవసాయ విధానం
B. ముద్రలు
C. టౌన్ ప్లానింగ్
D. మత క్రతువులు

45. “బాసాదిస్” అనే పదం దేనికి సంబంధించినది?
A. శిల్ప కళలు
B. జైనుల దేవాలయం
C. చిన్న సాహిత్య కథలు
D.  బౌద్ధుల దుస్తులు

46. సింధులోయ నాగరికతలో కొనసాగింపు ఎందులో ప్రదర్శింపబడలేదు?
A. గోధుమ మరియు పత్తిసాగు
B. పశుపతి శివుని ఆరాధన
C. పంచ్ మార్క్ నాణేలు
D. లిపి

47. బృహత్కథ రచయిత ఎవరు?
A. సత్యం శంకరరామన్
B. అబూరి ఛాయాదేవి
C. గుణాఢ్యుడు
D. ఉమర్ అలీషా

48. ఈ క్రింది సింధులోయ సైట్లలో ఏది ప్రపంచంలోనే తొలి సైన్ బోర్డును ఇచ్చింది?
A. రోపార్
B. ధోలవీర
C. లోథాల్
D. కాలిభంగన్

49. చక్రం ఏ సంవత్సరంలో కనుగొనబడింది?
A. 206 BC
B. 50 BC
C. 3500 BC
D. 45 BC

50. భారత చక్రవర్తి హర్షవర్ధనుడు తన రాజధానిని ఎక్కడికి మార్చాడు?
A. థానేశ్వర్ నుండి కన్నౌజ్ కి
B. ఢిల్లీ నుండి థానేశ్వర్ కి
C. థానేశ్వర్ నుండి కాంబోజ
D. కాంబోజ నుండి వల్లభి

51. హరప్పన్ ప్రాంతంలో భారతదేశంలో లేని ప్రదేశం?
A. లోథాల్
B. మొహంజోదారో
C. రోపార్
D. బన్వాలీ

52. ప్రజలకు, దేవతలకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఋగ్వేద దేవుడు ఎవరు?
A. ఇంద్ర
B. వరుణ
C. అగ్ని
D. మారుత్

53. నీతి చంద్రిక రచయిత ఎవరు?
A. ధర్మవరం రామకృష్ణమాచార్యులు
B. కోలచోళం శ్రీనివాసరావ్
C. తాడిపత్రి రాఘవాచార్యులు
D. పరవస్తు చిన్నయసూరి

54. విమానశైలి అనేది ఎవరి విశిష్ట పద్ధతి?
A. ద్రావిడ దేవాలయాలు
B. సోలంకీ శైలి
C. గుప్తుల దేవాలయాలు
D. ప్రతీహార దేవాలయాలు

55. గౌతమ బుద్ధుడు మొదటి ధర్మాన్ని ఎక్కడ బోధించాడు?
A. కాశీ
B. సారనాథ్
C. వైశాలి
D. కేరళ

56. సద్గురు ఆదిశంకరాచార్యులు ఏ రాష్ట్రంలో జన్మించారు?
A. కర్ణాటక
B. మహారాష్ట్ర
C. కేరళ
D. తమిళనాడు

57. మామల్లపురం లేదా మహాబలిపురం అనే నగరాన్ని నిర్మించినది ఎవరు?
A. మొదటి పరమేశ్వర వర్మన్
B. మొదటి నరసింహ వర్మన్
C. రెండవ నరసింహ వర్మన్
D. సింహవిష్ణు

58. ఈ క్రిందివాటిలో ఏది హరప్పా ప్రదేశం కాదు?
A. కోట్ డిజి
B. చన్హుదారో
C. సాహ్ గౌరా
D. దేసాల్ పూర్

59. ఈ క్రింది ఏ శాసనాల్లో ఒక శాసనం అశోకుడి రాతి ప్రతిమతో పాటు ఉంది?
A. సాంచీ శాసనం
B. షాబాజ్ గర్హి శాసనం
C. సాహ్ గౌరా శాసనం
D. కంగనహల్లి

60. క్రింద పేర్కొన్న ఏ బౌద్ధ స్థావరంలో “తంబయ దానం” అనే పదం గుర్తించబడింది?
A. చందవరం
B. కొత్తూరు
C. అమరావతి
D. భట్టిప్రోలు

61. POSCO చట్టం ప్రకారం పిల్లలంటే ............
A. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు
B. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు
C. 14  సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు
D. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు

62. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
A. డిసెంబర్ 26
B. డిసెంబర్ 6
C. డిసెంబర్ 3
D. డిసెంబర్ 1

63. ICDS అనేది ...............
A. భారతీయ బాలల అభివృద్ధి
B. సమీకృత బాలల అభివృద్ధి
C. అంతర్జాతీయ బాలల అభివృద్ధి
D. అంతర్గత బాలల అభివృద్ధి

64. భారతదేశంలో మహిళలు స్వతంత్రంగా నడిపే ఏకైక గ్రామీణ వార్తా పత్రిక?
A. దైనిక్ భాస్కర్
B. ఖబర్ లహరియా
C. సవేరా
D. మనోరమ

65. 1974 లో స్థాపించబడిన SEWA బ్యాంక్ పేద మహిళలకు పరపతి (క్రెడిట్) దేని కోసం అందిస్తుంది?
A. విద్యా కార్యకలాపాలు
B. వ్యక్తిగత ఉపయోగం
C. వైద్య ఉపయోగం
D. ఆర్థిక కార్యకలాపాలు

66. ఆహారాల అవసరాలు, భారతీయ ఆహార పోషక విలువల గూర్చి తెలిపినది?
A. సి.ఎఫ్.టి.ఆర్.ఐ (CFTRI)
B. ఎన్.ఐ.ఎన్ (NIN)
C. ఐ.సి.ఎ.ఆర్ (ICAR)
D. డబ్ల్యు. హెచ్.ఓ (WHO)

67. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎదుగుదల కుంటుబాటు, పోషకాహార లోపాన్ని ముందస్తుగానే గుర్తించేందుకు ఉపయోగించే సాధనం?
A. ఆహార సర్వే (డైట్ సర్వే)
B. ఎదుగుదల పర్యవేక్షణ
C. క్లినికల్ లక్షణాల పరిశీలన
D. జీవ రసాయన (బయో కెమికల్) విశ్లేషణ

68. పేదరిక దిగువన గల BPL కుటుంబాల మహిళలకు ఉచిత LPG కనెక్షన్ అందించే పథకం?
A. స్వధార్ యోజన
B. ఉజ్వల యోజన
C. మాతృత్వ సహయోగ్ యోజన
D. మహిళలకు శిక్షణ మరియు ఉపాధి కార్తక్రమానికి మద్దతు.

69. సామాజిక స్తరీకరణ అంటే?
A. సామాజిక సమ్మిళితం
B. వ్యత్యాసం
C. క్రమానుగత శ్రేణి మరియు వ్యత్యాసం
D. క్రమానుగత శ్రేణి

70. ఇలా భట్ దీని వ్యవస్థాపక సభ్యురాలు .......
A. స్త్రీ ముక్తి సంఘటన్
B. స్త్రీ ముక్తి సంఘర్ష
C. మహిళా స్వయం ఉపాధి సంఘం
D. మహిళల అణచివేత వ్యతిరేక వేదిక

71. సత్యశోధక్ సమాజ్ వీరిచే 1873 లో స్థాపించబడింది?
A. మహాత్మా గాంధీ
B. జ్యోతిరావ్ పూలే
C. ఇ.వి.ఆర్. పెరియార్
D. బి.ఆర్. అంబేద్కర్

72. భారతదేశంలో అనైతిక చర్యల నిరోధక చట్టం (1956) ప్రధానంగా ఏ విషయంలో ప్రస్తావించబడింది?
A. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన
B. గృహ హింస
C. బాల కార్మికులు
D. అక్రమ రవాణా చేయబడిన మహిళలు

73. సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం పిలుపునిచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో సమీకరించబడింది?
A. మహారాష్ట్ర
B. ఆంధ్రప్రదేశ్
C. తమిళనాడు
D. మధ్యప్రదేశ్

74. రాష్ట్రీయ మహిళా కోష్ వీరికి రుణాలను అందిస్తుంది.
A. స్వయం సహాయక బృందాలు
B. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్
C. మైక్రోఫైనాన్స్ సంస్థలు
D. మహిళల అనధికార సమూహాలు

75. NFHS అనే సంక్షిప్త పదం విస్తరణ ......
A. నేషనల్ ఫ్యామిలీ హౌస్ హెరీల్డ్ సర్వే
B. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే
C. నేషనల్ ఫిస్కల్ హెల్త్ సర్వే
D. నేషనల్ ఫైనాన్షియల్ హెల్త్ సర్వే
Result: