401. హిమాచల్/నిమ్న హిమాలయాలు వేటికి ప్రసిద్ధి?
A. పొడవైన పర్వత శ్రేణులకు, వేసవి విడిదులకు
402. హిమాచల్ శ్రేణులలో పొడవైన శ్రేణి ఏది?
A. పిర్ పంజాల్ శ్రేణి (J&K)
403. కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య కలదు?
A. హిమాద్రి హిమాలయాలకు, పీర్ పంజల్ శ్రేణులకు మధ్య
404. కాశ్మీర్ లోయలోని క్రమక్షయ మైదానాలను ఏమని పిలుస్తారు?
A. కారేవాస్
405. కారేవాస్ మైదానాలలో పండే ప్రధాన పంట ఏది?
A. కుంకుమ పువ్వు
406. పీర్ పంజల్ శ్రేణికి, ధౌలధార్ శ్రేణికి మధ్యలో గల లోయ ఏది?
A. చంబల్ లోయ
407. చంబల్ లోయ ఏ నది ఒడ్డున ఉంది?
A. రావి నది
408. ధౌలధార్ శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది?
A. White Mountain (5,639 మీ.)
409. White Mountain శిఖరాన్ని ఏమని పిలుస్తారు?
A. హనుమాన్ జీ కా తిబా
410. ఖజ్జియార్ వేసవి విడిది ఏ శ్రేణులలో కలదు?
A. ధౌలధార్ శ్రేణిలో
411. ధౌలధార్ శ్రేణి, పీర్ పంజల్ శ్రేణికి ఏ భాగంలో ఉంది?
A. నైరుతీ భాగంలో
412. ముస్సోరి శ్రేణికి గల మరో పేరు ఏమిటి?
A. Queen of Mountains
413. భారతదేశపు స్విట్జర్లాండ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
A. ఖజ్జియార్ వేసవి విడదిని
414. ఖాట్మండు లోయ ఏ శ్రేణుల మధ్య ఉంది?
A. హిమాద్రి శ్రేణులకు, మహాభారత్ శ్రేణులకు మధ్య
415. థింపు లోయ ఏ పర్వతాల మధ్య ఉంది?
A. హిమాద్రి శ్రేణులకు, బ్లాక్ పర్వతాలకు మధ్య
416. “హిమాలయాల యొక్క పర్వతపాద ప్రాంతాలు” అని ఏ పర్వతాలను పిలుస్తారు?
A. శివాలిక్ పర్వతాలను
417. శివాలిక్/బాహ్యహిమాలయాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
A. పాకిస్తాన్‌లోని పొట్వార్ పీఠభూమి నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని దిహంగ్ గార్జ్ వరకు
418. భారతదేశ మొదటి ఆదిమానవులైన “రామా పిథికస్” ఏ ప్రాంతాలలో నివసించారు?
A. శివాలిక్ పర్వత ప్రాంతాలలో
419. మనదేశంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతం ఏది?
A. శివాలిక్ ప్రాంతం
420. మనదేశంలో భూకంపాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది?
A. అస్సాం
421. శివాలిక్ శ్రేణులను జమ్మూ కాశ్మీర్ లో ఏమని పిలుస్తారు?
A. జమ్మూ కొండలు
422. శివాలిక్ శ్రేణులను గోరఖ్‌పూర్ లో ఏమని పిలుస్తారు?
A. దుద్వా కొండలు
423. శివాలిక్ శ్రేణులను అస్సాంలో ఏ పేర్లతో పిలుస్తారు?
A. మికిర, నార్త్ కలూర్, కచ్చార్ కొండలు
424. శివాలిక్ శ్రేణులను నాగాలాండ్ లో ఏమని పిలుస్తారు?
A. నాగ/కోహిమా కొండలు
425. శివాలిక్ శ్రేణులను అరుణాచల్ ప్రదేశ్ లో ఏ పేర్లతో పిలుస్తారు?
A. అబోర్, డాప్లా, మిర్, మిష్మి, పాట్కాయ్ బాయ్ కొండలు.
426. నేపాల్ మరియు సిక్కిం లో శివాలిక్ శ్రేణిని ఏమని పిలుస్తారు?
A. చురియా మురియా కొండలు, ధాంగ్ కొండలు, దుద్వా కొండలు.
427. మిజోరాం లో శివాలిక్ శ్రేణిని ఏ పేరుతో పిలుస్తారు?
A. లుషాయి, మిజో కొండలు
428. మేఘాలయలో శివాలిక్ శ్రేణులను ఏ పేర్లతో పిలుస్తారు?
A. కాశీ, ఫరో, జయంతి కొండలు
429. పశ్చిమబెంగాల్ లో శివాలిక్ శ్రేణిని ఏ పేరుతో పిలుస్తారు?
A. డ్వార్ఫ్ కొండలు
430. హిమాద్రికి, ఉత్తరంగా లఢాక్, టిబెట్ భూభాగాలలో విస్తరించి ఉన్న హిమాలయాలను ఏమంటారు?
A. ట్రాన్స్ హిమాలయాలు
431. టిబెటియన్ హిమాలయాలు అని వేటిని అంటారు?
A. ట్రాన్స్ హిమాలయాలు టిబెట్ లో అధికంగా విస్తరించి ఉన్నందువల్ల వీటిని “టిబెటియన్ హిమాలయాలు” అని అని అంటారు.
432. సులేమాన్, కిర్తాల్ పర్వత శ్రేణులు ఎక్కడ కలవు?
A. పాకిస్తాన్
433. హిందూకుష్, సఫేదీ కోహీ హింద్ రాజ్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
A. ఆఫ్ఘనిస్తాన్
434. కున్లున్, టయాన్ షాన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
A. చైనా
435. కారాకోరం, లఢక్, జస్కర్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
A. భారత్
436. కారాకోరం అంటే అర్థం ఏమిటి?
A. నల్లని పర్వతాలు అని అర్థం
437. కారాకోరం శ్రేణులు భారతదేశానికి ఏ దిక్కున గల చివరి కొండలు?
A. ఉత్తర దిక్కున
438. ఏ పర్వతాలను “ఆసియా ఖండం యొక్క వెన్నెముక” (Back bone of Asian Continent) గా పేర్కొంటారు?
A. కారాకోరం పర్వతాలను
439. కారాకోరం శ్రేణికి భారత్ లో గల మరొక పేరు ఏమిటి?
A. కృష్ణగిరి పర్వతాలు
440. కారాకోరం శ్రేణిని చైనాలో ఏమని పిలుస్తారు?
A. గ్యాంగ్ డైజ్
441. కారాకోరం శ్రేణిలో గల పర్వతాలు ఏవి?
A. 1. గాడ్విన్ ఆస్టిన్ 2. గశేబ్రం/హీడెన్ పీక్ 3. బ్రాడ్ పీక్
442. జమ్మూ కాశ్మీర్ లో నివసిస్తున్న హిమాలయాలలోని తెగలు ఏవి?
A. బాల్టి, బేకార్ వాల్, జస్కారి
443. లఢక్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. లఢాఖీ, బాల్టి
444. హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. గడ్డి, గుజ్జర్లు, పహారి
445. ఉత్తరాఖండ్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. భోటియా, పహారి
446. సిక్కింలో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. లెప్చ, దృక్పా
447. పశ్చిమబెంగాల్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. సంతాల్, దృక్పా
448. అరుణాచల్ ప్రదేశ్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. నోక్టె, మిష్మి, మోన్నా, షెర్డుక్ పెన్
449. భూటాన్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. దృక్పా తెగ
450. నేపాల్ లో నివసిస్తున్న హిమాలయాల్లోని తెగలు ఏవి?
A. షెర్పాలు, నెవార్, గురుంగ్, థారు